Share News

మీ ధర్నాలు చూసి.. మీ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు: సోమిరెడ్డి

ABN , Publish Date - May 19 , 2026 | 01:09 PM

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేతలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

మీ ధర్నాలు చూసి.. మీ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు: సోమిరెడ్డి
TDP MLA Somireddy Chandramohan Reddy

అమరావతి, మే19: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేతలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ ఆందోళనల్లో మీ పార్టీ వాళ్లే పాల్గొన లేదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సోమవారం మీరు చేపట్టిన ధర్నాలు చూసి.. మీ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మంగళవారం రాజధాని అమరావతిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజీల్ ధరలు జగన్ ప్రభుత్వ హయాంలోనే పెంచారని గుర్తు చేశారు.


మళ్లీ ఇప్పుడు మీరే ఆందోళన చేయడం ఏమిటని వైసీపీ నేతలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మీ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి పెంచిన ధరలపై మీరే ఆందోళన చేస్తారా? అంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో పెట్రోల్, డీజిల్‌పై తాము నయాపైసా పెంచామా? అని వైసీపీ నేతలను సూటిగా ఆయన ప్రశ్నించారు.


అసలు విషయాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేయడం సిగ్గు చేటని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివర్ణించారు. గతంలో మీ ప్రభుత్వం పెంచిన ధరలపై మీరే ఆందోళన చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటూ వైసీపీ కేడర్‌కు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు వైసీపీకి రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు.


వైసీపీ హయాంలో అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ ధరలు పెంచడమే కాకుండా.. నకిలీ మద్యం ఇచ్చి వేలాది మంది ప్రజల ప్రాణాలు తీయలేదా? అంటూ వైసీపీ నేతలను నిలదీశారు. ఆ విషయాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని తెలుసుకోవాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూకట్‌పల్లి లులు హైపర్ మార్కెట్లో అధికారుల తనిఖీలు.. 150 కిలోల ఆహార పదార్థాల సీజ్

వీధి కుక్కలు.. ప్రజల ప్రాణాల భద్రతా అంశంగా పరిగణించండి: సుప్రీంకోర్టు

For AP News And Telugu News

Updated Date - May 19 , 2026 | 01:29 PM