వైసీపీని 'గొడ్డలి పార్టీ' అనకుంటే మరేమంటారు?: ఎమ్మెల్యే అహ్మద్
ABN , Publish Date - May 03 , 2026 | 02:16 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ నేత మహమ్మద్ నసీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే జగన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని వ్యంగ్యంగా అన్నారు.
అమరావతి, మే 03: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ నేత మహమ్మద్ నసీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే జగన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనీ తమది గొడ్డలి పార్టీ కాదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత బాబాయ్‌ని గొడ్డలితో నరికి చంపిన చరిత్ర కలిగిన వైసీపీని 'గొడ్డలి పార్టీ' అనకుంటే మరేమంటారు? అని జగన్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. అధికారం కోసం కన్నవాళ్లను బజారుకీడ్చి.. అడ్డువచ్చిన వారిని అంతమొందించే మనస్తత్వం వైఎస్ జగన్‌ది అన్నారు.
పరిటాల రవి హత్య నుంచి నేటి వివేకా హత్య వరకు రక్త చరిత్రను కొనసాగిస్తున్న ఘనత కూడా వైఎస్ జగన్‌దేనని టీడీపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, జాలయ్య యాదవ్ వంటి సామాన్య కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నది వైసీపీ కాదా? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి.. ఆతడి శవాన్ని ఇంటికే పంపిన అమానవీయ సంస్కృతి కూడా వైసీపీదేనంటూ ఆ పార్టీనేతలకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే చురకలంటించారు. మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను వేధించి, ఆయన ప్రాణాలు పోయేలా చేసింది గొడ్డలి పార్టీ కాదా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.
గుంటూరు రమ్య, పలమనేరు మిస్బా, పులివెందుల నాగమ్మ.. ఇలా ఎందరో ఆడబిడ్డల హత్యలకు జగన్ పాలనే కారణమని కుండబద్దలు కొట్టారు. నిందలు మోపి, మానసిక క్షోభకు గురి చేసి అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ప్రాణాలు తీసిన పాపం కూడా వైసీపీదేనని పేర్కొన్నారు. నంద్యాలలో మైనార్టీ కుటుంబం సామూహిక ఆత్మహత్య చేసుకోవడానికి వైసీపీ నేరపూరిత పాలననే కారణమన్నారు. పరిటాల రవి, వివేకా హత్య కేసుల్లో సాక్షులను కూడా వరుసగా అంతమొందించిన చరిత్ర వైఎస్ జగన్ రెడ్డిది అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు.
అధికారులు, విపక్షాలనే కాకుండా.. చివరికి సొంత పార్టీ నేతలను కూడా చిత్రహింసలు పెట్టిన సైకో పార్టీ వైసీపీ అని అభివర్ణించారు. నేరపూరిత రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్ రెడ్డితోపాటు వైసీపీ.. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని టీడీపీ ఎమ్మెల్యే అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. రప్పా రప్పా అంటూ నిత్యం పేట్రేగిపోతున్నందుకు.. ఈ నేరపూరిత కేకల్ని సమర్థిస్తున్నందుకు గొడ్డలి పార్టీ కాక మరేమవుతుందని జగన్ పార్టీ నేతలను టీడీపీ ఎమ్మెల్యే అహ్మ ద్ బల్లగుద్దీ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి
నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
For More AP News And Telugu News