Share News

మద్యం స్కాంలో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:30 PM

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 7గా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు.

మద్యం స్కాంలో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

అమరావతి, ఫిబ్రవరి 24: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 7గా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మంగళవారం ముందస్తు బెయిల్ కోసం ముప్పిడి అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాకుండా.. ఫిబ్రవరి 26వ తేదీన విచారణాధికారి ఎదుట లొంగిపోవాలని అతడికి షరతు విధిస్తూ ఆదేశించింది.


ఆ తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలంటూ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ముప్పిడి అవినాశ్ రెడ్డి ..శ్రీలంకలో తలదాచుకున్నారు. ఈ లిక్కర్ స్కాం కేసులో దోచిన నగదును ముప్పిడి అవినాశ్ రెడ్డి ద్వారా రాజ్ కసిరెడ్డి విదేశాల్లో దాచారంటూ.. అందుకు సంబంధించిన అనుమానాలు బలంగా ఉన్నాయంటూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలోనే అభిప్రాయపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం

కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి.. ఇవిగో సింపుల్ చిట్కాలు..

For More TG News And Latest News

Updated Date - Feb 24 , 2026 | 01:35 PM