Share News

షర్మిల కుమార్తె వివాహ వేదిక వివాదం.. స్పందించిన మంత్రి లోకేశ్

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:55 AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ రెడ్డికి ఆయన సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా షర్మిల కుమార్తె అంజలి వివాహ వేదిక విషయంలో అన్నాచెల్లెలి మధ్య చోటు చేసుకున్న వివాదంతో.. వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది.

షర్మిల కుమార్తె వివాహ వేదిక వివాదం.. స్పందించిన మంత్రి లోకేశ్

అమరావతి, అక్టోబర్ 27: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ రెడ్డికి ఆయన సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా షర్మిల కుమార్తె అంజలి వివాహ వేదిక విషయంలో అన్నాచెల్లెలి మధ్య చోటు చేసుకున్న వివాదంతో.. వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. తాజాగా వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేదిక వివాదంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు.


మంగళవారం ఆయన తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రతి కుటుంబంలో జరిగే వివాహంలో తన మేనకోడలిని ఆశీర్వదించి, ఆ వేడుకను గుర్తుండిపోయేలా చేయడానికి మామ ఒకరు ఉంటారు. ఇక్కడ వైఎస్ఆర్ గారి సొంత ఇంట్లో వివాహం జరగనివ్వకుండా @ysJagan అడ్డుకుంటున్నారు. ఆయన తన సొంత చెల్లెలితో, మేనకోడలుతో ఇలా ప్రవర్తిస్తే.. గత ఐదేళ్లుగా మన అక్కాచెల్లెళ్లతో ఆయన ఎలా ప్రవర్తించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికే తెలుసు’నని పేర్కొన్నారు.


ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి తన కుమార్తె అంజలి రెడ్డిని యూఎస్‌లో స్థిరపడిన ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ ఎస్ రఘురామ్ రెడ్డితో వివాహం జరపాలని నిశ్చయించారు. సెప్టెంబర్ చివరి వారంలో కుమార్తె నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 25వ తేదీన బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ వేదికగా ఈ వివాహం జరపాలని వైఎస్ షర్మిల కుటుంబం నిశ్చయించింది. అయితే సదరు ప్యాలెస్‌లో మేనకోడలు వివాహం చేయవద్దని షర్మిలకు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కావాలంటే.. హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని నివాసంలో అంజలీ రెడ్డి వివాహం చేయవచ్చని వైఎస్ షర్మిలకు లేఖ ద్వారా వైఎస్ జగన్ సూచించారు.


మరో వైపు పలు రాష్ట్రాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు శుభలేఖలను అందజేసి ఈ వివాహానికి వైఎస్ షర్మిల ఫ్యామిలీ స్వయంగా ఆహ్వానిస్తుంది. మేనకోడలు వివాహం జరగనున్న వేళ వైఎస్ జగన్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలి: హోం మంత్రి అనిత ఆదేశం

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోరీలు.. తల్లీకూతుళ్ల అరెస్ట్

For More AP News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 01:58 PM