మరింత మెరుగుపడిన రాప్తాడు విద్యార్థిని ఆరోగ్యం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Nov 09 , 2026 | 09:40 PM
అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను చిన్నపిల్లల అత్యవసర చికిత్స విభాగం నుంచి సాధారణ వార్డుకు మార్చారని చెప్పారు.
అమరావతి, నవంబర్ 09: అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను చిన్నపిల్లల అత్యవసర చికిత్స విభాగం నుంచి సాధారణ వార్డుకు మార్చారని చెప్పారు. రాజధాని అమరావతిలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు విద్యార్థిని గాయాలకు వైద్య బృందం మరోసారి కట్లు మార్చారని పేర్కొన్నారు. ఎడమ చేతికి వేసిన పట్టీని వైద్యులు తొలగించారని అన్నారు.
దీంతో ఆమె చేతిని కదిలించేందుకు సౌలభ్యం ఏర్పడిందని మంత్రి సత్యకుమార్ వివరించారు. ఆహారం తక్కువ తీసుకుంటుందని తెలిపారు. దీంతో ముక్కు ద్వారా గొట్టంతో ఆహారం అందిస్తున్నారని చెప్పారు. నోటి ద్వారా ఆహారం తీసుకునేలా ఆమెను వైద్యులు ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. డాక్టర్ భాస్కర్ షెనాయ్ పర్యవేక్షణలో విద్యార్థినికి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ వైద్యుల సమన్వయంతో బాలికకు చికిత్స అందుతోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాహనం బోల్తా.. పరిగి ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
Read Latest AP News And Telugu News