ప్రైవేట్ భూమిని 22ఎలో పెడితే చర్యలు: అధికారులకు మంత్రి వార్నింగ్
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:00 PM
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మీ భూమి - బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుండి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 08: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని 22ఎలో పెడితే ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. గురువారం అమరావతిలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏదైనా భూమిని 22ఎ జాబితాలో చేర్చేందుకు విధివిధానాలను స్పష్టం చేస్తూ జీవో నెం.445 ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. ఈ జీవో ప్రకారం ఏదైనా ప్రైవేట్ భూమిని 22ఎ జాబితాలో పెట్టాలంటే ఆ అధికారే దాన్ని నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కక్ష పూరితంగా 22ఎలో చేర్చిన 28 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించామని గుర్తు చేశారు. ఈ జీవో వచ్చిన తర్వాత 28,790 ఎకరాలను తొలగించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో1,100 ఎకరాలను తొలగించామని.. మిగిలిన వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మీ భూమి - బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుండి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
ఈ ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు చోటుచేసుకున్న 4 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని చెప్పారు. దీర్ఘకాలికంగా శతాబ్దాల కాలం పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. వట్టిచెరుకూరు, శెట్టిపల్లి, పుల్లడిగుంట, కంగుంది, అవులపల్లి, గూటుపల్లి, కోనసీమ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో వేల మందికి వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్
For More AP News And Telugu News