Share News

భక్తుల సౌకర్యమే లక్ష్యంగా.. పుణ్యక్షేత్రాలకు రహదారుల అనుసంధానం

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:54 PM

రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు రహదారులు అనుసంధానించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంకల్పించారు.

భక్తుల సౌకర్యమే లక్ష్యంగా.. పుణ్యక్షేత్రాలకు రహదారుల అనుసంధానం

అమరావతి, ఆగస్టు 23: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు రహదారులు అనుసంధానించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంకల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలకు గ్రామీణ రహదారుల అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సుమారు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో 205 కిలోమీటర్ల పొడవున ప్రధాన ఆలయ అనుసంధాన రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు.


దీంతో మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలకు భక్తులు సులభంగా చేరుకోగలుగుతారు. ఐఎస్ జగన్నాథపురం, అహోబిలం తదితర నరసింహ క్షేత్రాలతోపాటు వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కొత్త కళ రానుంది. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. అందులో 40 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయింది.


వార్తలు కూడా చదవండి..

శబరిమలలో తెలుగు స్వాముల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భానుప్రకాశ్ రెడ్డి

రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ‘ఛత్రోంకీ గూంజ్’ పెట్టాలి: రాంచందర్‌రావు

For More AP News And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 05:16 PM