Share News

నేతన్నలకు గుడ్‌న్యూస్.. పెన్షన్‌ దరఖాస్తుకు తొలగిన కీలక అడ్డంకి..

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్న భరోసా పెన్షన్‌ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.

నేతన్నలకు గుడ్‌న్యూస్.. పెన్షన్‌ దరఖాస్తుకు తొలగిన కీలక అడ్డంకి..
AP Minister Savitha

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్న భరోసా పెన్షన్‌ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధన నుంచి సీఎం చంద్రబాబు సర్కార్ మినహాయింపు ఇచ్చింది. ఇకపై పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ సమర్పించాల్సిన అవసరం లేదని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. బ్యాంకు స్టేట్‌మెంట్‌కు బదులుగా మాస్టర్‌ వీవర్‌ ధ్రువీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. దీని వల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయని మంత్రి తెలిపారు.


ఈ సందర్భంగా 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ పెన్షన్లు అందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు. అర్హత ఉన్న నేతన్నలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. నేతన్నలకు ఆర్థికంగా మేలు జరిగేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి సవిత చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 11 , 2026 | 04:54 PM