ప్రధాని మోదీ.. అద్భుతమైన, విశిష్టమైన నాయకుడు : సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 10 , 2026 | 09:35 PM
తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది ప్రధాన మంత్రులను అత్యంత దగ్గరగా పరిశీలించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన, విశిష్టమైన నాయకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.
న్యూఢిల్లీ, జూన్ 10: తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది ప్రధాన మంత్రులను అత్యంత దగ్గరగా పరిశీలించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన, విశిష్టమైన నాయకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. బుధవారం న్యూఢిల్లీలో ఎన్డీయే కూటమిలోని పార్టీల నేతలు సమావేశమయ్యారు.
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ప్రధాని నరేంద్ర మోదీ లాంటి విశిష్టమైన నాయకుడిని తాను చూడలేదన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లే అన్ని శక్తి సామర్థ్యాలు ప్రధాని మోదీకి ఉన్నాయని తెలిపారు.
ప్రధాని మోదీ భారత రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్రను సృష్టించారని పేర్కొన్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు నరేంద్ర మోదీ నిరంతరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతూనే ఉన్నారని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజాదరణతో అధికారంలో కొనసాగుతున్న అరుదైన రికార్డు నరేంద్ర మోదీదని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి.. '
127 మంది సైబర్ నేరస్తులు అరెస్ట్: టీజీసీఎస్‌బీ
సీఎం రేవంత్‌కు ఓటమి తప్పదు: ఎంపీ అర్వింద్
For More AP News And Telugu News