Share News

నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ ‘డైనో డీట్స్’ ప్రారంభం.. స్పందించిన లోకేశ్

ABN , Publish Date - May 17 , 2026 | 02:31 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ డైనో డీట్స్ (Dino Deets) ప్రారంభించారు. అందుకు సంబంధించిన టీజర్‌‌ను ఆదివారం విడుదల చేశారు.

నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ ‘డైనో డీట్స్’ ప్రారంభం.. స్పందించిన లోకేశ్

అమరావతి, మే 17: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ ‘డైనో డీట్స్’ (Dino Deets) ప్రారంభించారు. అందుకు సంబంధించిన టీజర్‌‌ను ఆదివారం విడుదల చేశారు. అందులో దేవాన్ష్ తండ్రి నారా లోకేశ్ భాగమయ్యారు. డైనో డీట్స్ (Dino Deets) టీజర్‌లోని యూట్యూబ్, పాడ్ కాస్ట్ ప్రత్యేకతలను దేవాన్ష్ ద్వారా మంత్రి నారా లోకేశ్ తెలుసుకున్నారు. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ మంత్రి లోకేశ్ ఉద్విగ్నంగా తన భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా నారా దేవాన్ష్‌కు నారా - నందమూరి కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.


డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింతలు, విశేషాలు ఆకట్టుకునే శైలిలో, నవ్విస్తూ, ఆలోచింపజేసేలా దేవాన్ష్ అందించే పాడ్ కాస్ట్‌లు ఈ యూట్యూబ్ చానల్ ద్వారా వీక్షకులకు చేరనున్నాయి.


యూట్యూబ్ చానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన నారా దేవాన్ష్ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది దేవాన్ష్ వేగంగా పరిష్కరించి ఈ రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..

For More AP News And Telugu News

Updated Date - May 17 , 2026 | 04:04 PM