Share News

బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు

ABN , Publish Date - May 17 , 2026 | 01:13 PM

పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ కేసులో మహిళా జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై రిజిస్ట్రార్ ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు
TG HIgh Court

హైదరాబాద్, మే17: పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ అరెస్టయ్యారు. అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే మహిళాజడ్జి జస్టిస్ మాధవీ దేవిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై చార్మినార్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి.. చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. దీంతో అతడు ముందస్తు బెయిల్, అరెస్ట్ నుంచి రక్షణ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వీటిని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.


అయితే ఈ కేసు విచారణలో బండి భగీరథ్‌కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే.. జస్టిస్ మాధవీ దేవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశాలను మహిళా జడ్జి జస్టిస్ మాధవీ దేవి స్వయంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


దీని వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ వ్యాఖ్యానించారు. మహిళా జడ్జి జస్టిస్ మాధవీ దేవిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో చేసిన విమర్శలను ఆధారాలతో సహా చార్మినార్ పోలీసులకు హైకోర్టు రిజిస్ట్రార్ అందజేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మరోవైపు బండి భగీరథ్ పోక్సో కేసులో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫొటోలు, వీడియోలు వైరల్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని సోషల్ మీడియా చానళ్లు.. బాధిత కుటుంబ వివరాలన బహిర్గతమయయ్యేలా.. ఫొటోలు, వీడియోలు ప్రసారం చేశాయి. ఇవి వైరల్‌గా మారడంతో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


బాలిక, ఆమె కుటుంబ వివరాలు బహిర్గతం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లను గుర్తించి అందుకు సంబంధించిన యూఆర్ఎల్‌లను ఉన్నతాధికారులకు పంపించారు. ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి గోప్యతకు భంగం కలిగిస్తే శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భార్యపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో భర్త

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..

For More TG News And Telugu News

Updated Date - May 17 , 2026 | 01:57 PM