Naga Babu: పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు: నాగబాబు
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:46 PM
గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టిన గొప్ప నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ఎమ్మెల్సీ నాగబాబు అభివర్ణించారు. రాష్ట్రంలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను పవన్ కల్యాణ్.. మొదటి స్థానంలోకి తీసుకు వచ్చారని వివరించారు.
అమరావతి, జనవరి 05: జనసేన పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని ఎమ్మెల్సీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ జనసేన శ్రేణులతో నాగబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టిన గొప్ప నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని అభివర్ణించారు.
ఏపీలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను పవన్ కల్యాణ్.. మొదటి స్థానంలోకి తీసుకువచ్చారని ప్రశంసించారు. కూటమి కలకాలం కలిసి ఉండాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అందరం కలిసిమెలిసి రాష్ట్రాభివృద్ధి కోసం పని చేద్దామంటూ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
కవిత ఆరోపణలు.. చర్యలు తీసుకోని సీఎం: టీ బీజేపీ చీఫ్
For More AP News And Telugu News