Nara Lokesh: గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:22 PM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో మరింత కాలం ఆయన జీవించాలన్నారు. దేశానికి మరికొన్ని ఏళ్ల పాటు సేవ చేయాలని ఆకాంక్షించారు.
అమరావతి, జనవరి 05: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో మరింత కాలం జీవించాలన్నారు. దేశానికి మరికొన్ని ఏళ్ల పాటు సేవ చేయాలన్నారు. గవర్నర్ జస్టిస్ నజీర్ మరింత కాలం ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
రాజ్యాంగంపై లోతైన అవగాహన, జ్యూడిషియరీలో విశేష అనుభవం ఆయనకు ఉందన్నారు. గవర్నర్ గారి స్థిరమైన నాయకత్వంలో రాష్ట్రంలో సాధికారతతోపాటు ప్రజాస్వామిక సంస్థలు బలోపేతం అవుతాయని మంత్రి నారా లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా గవర్నర్‌కు లోకేశ్ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కవిత ఆరోపణలు.. చర్యలు తీసుకోని సీఎం: టీ బీజేపీ చీఫ్
ప్రపంచ తెలుగు మహాసభలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News