Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే విజయం: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Aug 25 , 2026 | 09:04 PM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీల వరకు కూటమి అభ్యర్థులదే విజయమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే విజయం: ఎంపీ కలిశెట్టి
MP Kalisetti Appalanaidu

అమరావతి, ఆగస్టు 25: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీల వరకు కూటమి అభ్యర్థులదే విజయమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలంటూ బెదిరించి.. ఇప్పుడు మాట మార్చి మాట్లాడుతున్నారంటూ జగన్‌పై మండిపడ్డారు.


మంగళవారం రాజధాని అమరావతిలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకుండా సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే అభ్యర్థులకు టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు.


గత ప్రభుత్వంలో గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు, రోడ్ల మరమ్మతులు కూడా చేయలేకపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలోనే గ్రామాల్లో రోడ్లు, కాలువల నిర్మాణం శరవేగంగా జరిగిందని ఎంపీ కలిశెట్టి వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీనే పెంచిన పెన్షన్లు అందిస్తూ పేదలకు అండగా నిలిచామని అన్నారు.


జగన్ అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన ప్రెస్ మీట్లు పెడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. నారా లోకేష్ విజయనగరం పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ ప్రజాదరణ లభించిందని తెలిపారు. టీడీపీకి బీసీలే వెన్నెముక.. వారిపై జగన్ కపట ప్రేమ చూపించడం హాస్యాస్పదంగా ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా.. జగన్‌కు లోకేష్ సవాల్

పాన్‌మసాలా అక్రమ తయారీ కేంద్రంపై సీజీఎస్టీ దాడులు.. రూ.76 లక్షల సరుకు సీజ్

For More AP News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 09:13 PM