కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేష్
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:34 PM
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రెండుసార్లు కాపాడిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో.. స్టీల్ ప్లాంట్ కాలుష్యం పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజలు పోరాడిన చరిత్రను గుర్తు చేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రెండుసార్లు కాపాడిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వైసీపీ తన గత వైఖరిని గుర్తు చేసుకోవాలని లోకేష్ సూచించారు. రాజధాని నిర్మాణం పేరుతో స్టీల్ ప్లాంట్ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగాయని ఆయన ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్ కాలుష్యం పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించడం తప్పు కాదని, అయితే ఆ సందర్భాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ లేకుండా చేయాలని కుట్ర పన్నిన జగన్ అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.
Also Read:
భారతీరాజా మృతికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం
యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్