Share News

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:24 PM

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు.

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు
AP Minister Atchannaidu

అమరావతి, ఆగస్టు18: పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లలో సానుకూల పురోగతి సాధించినట్లు తెలిపారు.


ఇప్పటి వరకు 117 వేలాలు పూర్తి.. సుమారు 60 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీవీ పొగాకు సగటు ధర కిలోకు సుమారు రూ.210గా ఉందని పేర్కొన్నారు. ఇటీవలి రోజుల్లో రోజుకు 1.5 నుంచి 2 మిలియన్ కిలోల వరకు పొగాకు అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు.


కొనుగోళ్ల వేగం పెరగడం.. ‘నో-బిడ్’ శాతం క్రమంగా తగ్గడం మంచి పరిణామం అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పొగాకు కొనుగోలు కంపెనీలు, ట్రేడర్లతో మరోసారి చర్చించామని తెలిపారు. కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని కంపెనీలు, ట్రేడర్లకు ఇప్పటికే స్పష్టమైన సూచన చేశామని వివరించారు.


‘నో-బిడ్స్’ను మరింత తగ్గించి రైతుల వద్దనున్న పొగాకు వేగంగా కొనుగోలు చేయాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతులకు లభించే సగటు ధర మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 08:29 PM