క్రీడల్లో నిజాయతీగా ఆడినవారికి ఉద్యోగాలొస్తాయనడానికి మేమే నిదర్శనం: ఉపాధ్యాయులు
ABN , Publish Date - May 31 , 2026 | 02:35 PM
మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఉపాధ్యాయులు సూచించారు. ఈ డీఎస్సీ నిర్వహణపై జరుగుతున్న దుష్ప్రచారాలను వారు ఖండించారు.
అమరావతి, మే31: మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఉపాధ్యాయులు సూచించారు. ఈ డీఎస్సీ నిర్వహణపై జరుగుతున్న దుష్ప్రచారాలను వారు ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం అమరావతిలో మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటాలో నియామకం పొందిన ఉపాధ్యాయులు ఒక వీడియో విడుదల చేశారు. వేలాది మంది నిరుద్యోగులు నాలుగైదేళ్లు కష్టపడి చదివితే ఈ అవకాశం వచ్చిందని వారు వివరించారు. తమకు ఏ ఏ క్రీడల్లో ప్రావీణ్యం ఉందో ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సోదాహరణగా వివరించారు.
అన్యాయంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దంటూ దుష్ప్రచారం చేసేవారికి ఉపాధ్యాయులు హితవు పలికారు. ప్రతిభ చూపిన వారికి ఈ డీఎస్సీలో న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అవాస్తవాలను ఖండించేందుకు తమ వంతుగా ముందుకొచ్చామని ఉపాధ్యాయులు వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు గత ప్రభుత్వం తమకు ఇవ్వలేదన్న టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఆడిన తమకు ఈ ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. క్రీడల్లో నిజాయతీగా ఆడినవారికి ఉద్యోగాలొస్తాయనడానికి తామే నిదర్శనమని వారు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హిమాచల్ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
For More AP News And Telugu News