Share News

మాషా అల్లా స్కాం బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి అనిత

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:36 PM

మీకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాషా అల్లా స్కాం బాధితులకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మాషా అల్లా బాధితులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

మాషా అల్లా స్కాం బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి అనిత
AP Home Minister Anitha

అమరావతి, ఆగస్టు 12: మీకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాషా అల్లా స్కాం బాధితులకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మాషా అల్లా బాధితులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ గ్రీవెన్స్‌లో దాదాపు 200 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత్ మాట్లాడుతూ.. ఈ స్కాంపై తక్షణమే విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీంతో డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు.


బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ బాధితుల సమస్యపై విజయవాడ పోలీస్ కమిషనర్‌తో ఆమె మాట్లాడారు. ఆర్థిక మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామనే మోసపూరిత హామీలను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. పేదల కష్టార్జితాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.


నాయుడుపేట నుంచి టీడీపీ గ్రీవెన్స్‌కు వచ్చిన తండ్రి–ఏడేళ్ల కుమార్తెకు హోం మంత్రి అనిత సాయం చేశారు. తండ్రికి ఉపాధి, కుమార్తెకు వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే టీడీపీ గ్రీవెన్స్ ప్రధాన లక్ష్యమని హోం మంత్రి అనిత వెల్లడించారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో టీడీపీ కార్యాలయానికి వచ్చినట్లు ఈ సందర్భంగా ఆ కుటుంబం వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

వికారాబాద్‌ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

For More AP News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 01:45 PM