మాచర్లలో మహిళపై అత్యాచారం కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:09 PM
గుంటూరు జిల్లా మాచర్లలో మహిళపై అత్యాచారం జరిగిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రియుడే అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.
పల్నాడు జిల్లా: మాచర్లలో మహిళపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, ప్రియుడే అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడికి ఎవరు సహకరించారనే అంశాన్ని పరిశీలిస్తూ, పోలీసులు మరిన్ని దర్యాప్తు చర్యలు చేపట్టారు.
కాగా, మాచర్లలో ఒంటరిగా ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగినిపై దుండగుడు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గత గురువారం చోటుచేసుకుంది. మంచి నీళ్లు కావాలంటూ దుండగుడు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి, ఆ తర్వాత కత్తితో బెదిరించి ఆమెపై దాడికి దిగాడు. బాధితురాలి కాళ్లుచేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రస్తుతం.. బాధితురాలు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా గుర్తించారు. ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News