Share News

APCRDA Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 07:14 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని అమరావతిలో ఏపీసీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

APCRDA Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్ణయాలు
CRDA Meeting

అమరావతి, జనవరి 06: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాజధాని అమరావతిలో జరిగిన ఏపీసీఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయింపునకు అంగీకారం తెలిపారు. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను మైనర్లు అయిన అనాథలకు వర్తింప చేయాలని ఆమోదించారు.


రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా తరహాలో అభివృద్ధి పరచాలనే ప్రతిపాదనలను ఈ సీఆర్డీఏ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్‌ పనులుకు పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించారు. ఈ రోజు ఏపీసీఆర్డీఏ 57వ సమావేశం జరిగింది.


ఈ సమావేశం అనంతరం..

ఈ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్‌తో కలిసి మంత్రి నారాయణ విలేకర్లతో మాట్లాడారు. ఏపీసీఆర్డీఏలో 754 పోస్టులకు రాటిఫికేషన్ చేశారని వివరించారు. ఈ ప్రాంతంలో తల్లిదండ్రులతోపాటు భూమి లేని ఏడుగురు మైనర్లకు పెన్షన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారన్నారు. వాణిజ్య ప్లాట్లకు గతంలో వాస్తు వద్దన్నారు.. అయితే వాటిలో కొన్నింటిని పరిశీలించాలని కోరారని పేర్కొన్నారు. వీటితోపాటు ఇలాంటివి 112 ఉన్నాయని.. వాటిని లాటరీ పద్దతి ద్వారా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.


కృష్ణా రివర్ ఫ్రంట్‌లో మెరీనా వద్ద 60 బోట్లు పార్కింగ్‌కు పీపీపీ మోడ్‌లో ఒక ఎకరం ఇచ్చేందుకు సీఆర్డీఏ అంగీకరించిందన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నాలుగున్నర ఎకరాల ల్యాండ్ పూలింగ్ పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఈ భూమికి బుధవారం ల్యాండ్ అక్విజేషన్‌కు నోటీసు ఇస్తున్నామని.. ఇది తప్పనిసరి పరిస్ధితుల్లో ఇవ్వాల్సి వస్తోందన్నారు. ప్రోసీజర్ ప్రకారం ఆ భూమిని తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నగరంలో మౌలిక వసతుల కల్పన, భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు.


స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటివి అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందులోభాగంగా రైల్వే ట్రాక్, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకు 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. బుధవారం ఎండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. పెదకూరపాడులోని ఎండ్రాయి, తుళ్లూరు మండలంలోని వడ్డమానులో తాను పాల్గొంటానని మంత్రి నారాయణ తెలిపారు.


ఆయా గ్రామాలకు వీలైనంత తొందరలో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ముందు ఈ గ్రామాల్లో 2 లైన్లు రహదారుల నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. 16666.57 ఎకరాలు మొత్తంగా ల్యాండ్ పూలింగ్‌కు తీసుకోవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ వేసేటప్పుడు గతంలోనే కృష్ణానది, విజయవాడ - చెన్నై హైవే, అవుటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన జరిగిందన్నారు. త్రీమెన్ కమిటీలో రైతులు తెచ్చిన సమస్యలపై పరిశీలించి పరిష్కరించే అంశంపైనా కూడా చర్చించామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇరుసుమండ బ్లోఔట్‌.. ఓఎన్‌జీసీ కీలక ప్రకటన..

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదే: బీజేపీ చీఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 06 , 2026 | 08:10 PM