Irusumanda Blowout: ఇరుసుమండ బ్లోఔట్.. ఓఎన్‌జీసీ కీలక ప్రకటన..
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:27 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఔట్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీ కీలక ప్రకటన చేసింది.
అమలాపురం, జనవరి 06: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఔట్‌లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఓఎన్‌జీసీ సిబ్బంది శాయశక్తుల కృషి చేస్తున్నారు. దీనిపై డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న మోరి - 5 వెల్ ఫీల్డ్‌పై ఓఎన్‌జీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్ (టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసెస్) విక్రమ్ సక్సెనాతో సహా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) సీనియర్ మేనేజ్‌మెంట్, క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ (CMT) నిపుణులతో కలిసి ఈ మంటలను నియంత్రించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు వివరించింది.
అధిక సామర్థ్యం ఉన్న వాటర్ పంపులను వినియోగించి.. సమీపంలోని నీటిపారుదల వనరుల నుండి తాత్కాలిక కాలువను రూపొందించడానికి పనులు చేపట్టినట్లు తెలిపింది. అందుకోసం సమగ్ర బ్లో అవుట్ నియంత్రణ ప్రణాళికను ఖరారు చేసినట్లు పేర్కొంది. అగ్నికీలల తీవ్రతను తగ్గించేందుకు నిపుణుల బృందం పని చేస్తోందని తెలిపింది. 600 మీటర్ల వ్యాసార్ధంలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి గాలి నాణ్యత, శబ్ద స్థాయిలను బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని ఓఎన్‌జీసీ వెల్లడించింది.
ఇంకోవైపు ఈ మంటలను గూడవల్లి పంట కాల్వ నుంచి పైపుల ద్వారా నీటిని మళ్లించి మంటలను అదుపుచేస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురంలోని ఓఎన్‌జీసీ బృందాలు రంగంలోకి దిగాయి. బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలను ఓఎన్‌జీసీ బృందం ముమ్మరం చేసింది. ఎగసిపడుతున్న అగ్నికీలలు కొంత మేర తగ్గాయని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. బ్లోఔట్ ప్రదేశానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే.. ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరు బాధ్యులనే అంశంపై చర్యలు చేపట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదే: బీజేపీ చీఫ్
కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News