మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 08:19 PM
భారీ వర్షాల కారణంగా సముద్రంలో వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ఐదు రోజులుగా వేటకు వెళ్లలేక పోతున్న మత్స్యకారులకు ఈ బియ్యం అందించాలని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 26: భారీ వర్షాల కారణంగా సముద్రంలో వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ఐదు రోజులుగా వేటకు వెళ్లలేక పోతున్న మత్స్యకారులకు ఈ బియ్యం అందించాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం రాజధాని అమరావతిలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో నదులు, రిజర్వాయర్లలో పెరిగిన నీటి ప్రవాహాలపై అధికారులను అడిగి ఆరా తీశారు.
ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా అధికారులు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 29 రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 23 నుంచి 26వ తేదీ వరకు రిజర్వాయర్లలో 21 టీఎంసీల మేర నీటి నిల్వలు పెరిగాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టుల్లో 5 టీఎంసీల మేర నీటి ప్రవాహ మట్టాలు పెరిగాయని తెలిపారు.
9 జిల్లాల్లోని 18 రిజర్వాయర్లలో 16 టీఎంసీల మేర నీటి మట్టాలు పెరిగాయని ఏపీ సీఎం పేర్కొన్నారు. పెరిగిన నీటి నిల్వలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. రిజర్వాయర్లు నింపడంతో పాటు చిన్న, మధ్య తరహా నీటి వనరులను కూడా నింపాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార బేసిన్లలో నీటి ప్రవాహాలు పెరిగాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వంశధారలో గోట్టా బ్యారేజీకి 7,214 నుంచి 47,100 క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగిందని అన్నారు. నాగావళిలో నారాయణపురం ఆనకట్టకు 2,100 నుంచి 49,800 క్యూసెక్కులకు నీటి ప్రవాహం పెరిగిందని తెలిపారు. మడ్డు వలస ప్రాజెక్టుకు 18 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం పెరిగిందని అన్నారు.
మడ్డువలసలో నీటి నిల్వ 1.61 నుంచి 2.79 టీఎంసీలకు పెరిగిందని ఆయన అన్నారు. అలాగే తోటపల్లి బ్యారేజీకి 2,484 నుంచి 23,250 క్యూసెక్కులకు పెరిగిన నీటి ప్రవాహమని చెప్పుకొచ్చారు. డొంకరాయి రిజర్వాయర్‌లో11.67 నుంచి 15.78 టీఎంసీలకు పెరిగిన నీటి నిల్వ అని తెలిపారు. సీలేరు గుంటవాడ రిజర్వాయర్‌లో 1.52 నుంచి 3.90 టీఎంసీలకు నీటి నిల్వలు పెరిగాయన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1.20 లక్షల నుంచి 3.50 లక్షల క్యూసెక్కులకు నీటి ప్రవాహం పెరిగిందని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి 8,187 నుంచి 40,521 క్యూసెక్కులకు పెరిగిందని ఇన్‌ఫ్లోలో చెప్పారు.
మన్నేరు ప్రవాహం 3,210 నుంచి 9 వేల క్యూసెక్కులకు పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. స్థానికంగా వచ్చే వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు. పులిచింతల - ప్రకాశం బ్యారేజీ మధ్య కొత్త బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్బంగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన మరో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనపైనా దృష్టి కేంద్రీకరించాలని వారికి స్పష్టం చేశారు. ఈ రెండు బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హిర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని వారిని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వంశధార నీటిని హిర మండలం రిజర్వాయర్‌లోకి తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారుల వెల్లడించారని చెప్పారు. కోస్తాంధ్రలో 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఉత్తరాంధ్రలోని నదుల్లో ప్రవాహా ఉధృతి కొనసాగుతుందన్నారు. సహాయక చర్యలతో పాటు నీటిని రిజర్వాయర్లకు మళ్లించడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత
సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం
Read Latest AP News And Telugu News