అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:04 PM
రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ (CRDA) శనివారం స్పష్టత ఇచ్చింది. 08-12-2014ను కటాఫ్ తేదీగా నిర్ణయించి మినహాయింపుల పరిశీలన చేయనున్నట్లు తెలిపింది.
అమరావతి, సెప్టెంబర్ 26: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ (CRDA) శనివారం స్పష్టత ఇచ్చింది. 08-12-2014ను కటాఫ్ తేదీగా నిర్ణయించి మినహాయింపుల పరిశీలన చేసినట్లు తెలిపింది. ఆ తేదీకి ముందే నిర్మాణాలున్న భూములు, చ. గజాల ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. గ్రామ నివాస ప్రాంతానికి దూరంగా ఉన్న ఖాళీ వ్యవసాయ భూములు కటాఫ్ తర్వాత రిజిస్ట్రేషన్లకు మినహాయింపు లేదని సీఆర్డీఏ స్పష్టం చేసింది.
ఇప్పటికే 6,473.72 ఎకరాలను ఎల్‌పీఎస్ (LPS) నుంచి మినహాయించినట్లు ఈ సందర్భంగా సీఆర్డీఏ గుర్తు చేసింది. కమిటీకి వచ్చిన 685 దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వివరించింది. రికార్డులు, శాటిలైట్ చిత్రాలు, రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించింది. తాజా దరఖాస్తులు, అభ్యంతరాలను జేసీ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఖారారు చేస్తుందని సీఆర్డీఏ వివరించింది. అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం అన్ని ప్రయోజనాలు అందిస్తామని సీఆర్డీఏ స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం
టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
Read Latest AP News And Telugu News