Vijayasai Reddy ED Notice: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..
ABN , Publish Date - Jan 17 , 2026 | 09:59 AM
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
అమరావతి: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈ నెల 22వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో విస్తృత స్థాయిలో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. ఇప్పుడు కీలక నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. లిక్కర్ పాలసీ అమలు సమయంలో పెద్దఎత్తున హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగాయని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉందని ఈడీ అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్‌లో ఆయన పాత్రపై వివరణ ఇవ్వాలని ఈడీ కోరినట్లు సమాచారం. ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు.. కీలక ఆధారాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
Also Read:
మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
For More Latest News