Share News

ఉమ్మడి ప్రకటనతో విశ్వసనీయతను స్పష్టం చేసిన ఎన్నికల సంఘం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 26 , 2026 | 09:34 PM

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా చేసిన ప్రకటన అపోహలకు ముగింపు పలికిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన స్పందించారు.

ఉమ్మడి ప్రకటనతో విశ్వసనీయతను స్పష్టం చేసిన ఎన్నికల సంఘం: సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబర్ 26: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా చేసిన ప్రకటన అపోహలకు ముగింపు పలికిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన స్పందించారు. ‘ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్. ఎస్. సందూ, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించింది’.


‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమష్టిగా, సంస్థాగత విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరం. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయి’.


‘బలమైన ప్రజాస్వామ్యంలో గెలుపును, ఓటమిని సమానంగా, హుందాతనంతో స్వీకరించడం కూడా నాయకత్వ లక్షణమే. మన రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యం. భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత

సీఈసీపై పోరుకు ఇండియా కూటమి సిద్ధం.. సెప్టెంబర్ 30న కీలక సమావేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 09:43 PM