Share News

ప్రధాని మోదీ నిర్ణయాలతో మరింత అభివృద్ధి చెందనున్న భారత్: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:47 PM

భారతదేశాన్ని అభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధాని నిర్ణయాలతో 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ నిర్ణయాలతో మరింత అభివృద్ధి చెందనున్న భారత్: సీఎం చంద్రబాబు

వారణాసి, సెప్టెంబర్ 17: భారతదేశాన్ని అభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధాని నిర్ణయాలతో 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం వారణాసిలో నిర్వహించిన వారణాసి - వాద్ నగర్ సంకల్ప్ యాత్రలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీని చూసి దేశం గర్వపడుతోందని అన్నారు.


ప్రధాని మోదీ జన్మదినాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయనకు వారణాసి కర్మ భూమి అని అభివర్ణించారు. మోదీని వారణాసి ప్రజలు వరుసగా మూడుసార్లు పార్లమెంట్‌కు పంపారని గుర్తు చేశారు. ఆయన పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.


ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నేడు. ఈ సందర్భంగా గురువారం వారణాసి - వాద్ ‌నగర్‌ సేవా సంకల్ప్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో సీఎం చంద్రబాబుతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబుపాటు వీరంతా వారణాసిలోకి శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వీరంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 03:01 PM