నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలివే..
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:51 PM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఢిల్లీ, నవంబర్ 17: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
భేటీ సందర్భంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు సంబంధించి ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలను అమలు చేసే అంశాన్ని నిర్మలా సీతారామన్ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. ఏపీలో వరుస తుపానులు, ఎల్‌నినో పరిస్థితుల వల్ల జరిగిన నష్టం గురించీ కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు. అలాగే, ఎల్‌నినో కారణంగా తలెత్తిన సమస్యలనూ వివరించారు. మరోవైపు, అర్నబ్, మురసు తుపాన్ల నష్టానికి సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో నష్టపోయిన ఏపీకి ఆర్థికసాయం చేయాలని నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ఈ భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీలో ఓ శుభకార్యానికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆయన హాజరుకానున్నారు. ఆ తర్వాత ఈరోజు రాత్రికి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బ్లో అవుట్ ఘటన.. తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్
తిరుపతిలో మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. యువకుల హల్‌చల్