దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:25 PM
శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవ చేశారని.. శెట్టిబలిజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని వెంకటరెడ్డిని ప్రశంసించారు.
అమరావతి: శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవ చేశారని.. శెట్టిబలిజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని వెంకటరెడ్డిని ప్రశంసించారు. చదువుతోనే సాధికారత వస్తుందనే సత్యాన్ని విశ్వసించి ఆ రోజుల్లోనే విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పారని కొనియాడారు. నేడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సీఎం చంద్రబాబు ట్వీట్..
'సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవతోపాటు, శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారు. ‘చదువుతోనే సాధికారత’ అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆ రోజుల్లోనే చాటి చెప్పారు. సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, తన వారందరికీ ధైర్యాన్ని ఇచ్చిన ధీశాలి దొమ్మేటి వెంకటరెడ్డి. ఈ జయంతి వేడుకల వేళ ఆయన్ను స్మరించుకుని, స్ఫూర్తి పొందుదాం' అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
అది పెట్రోల్ షార్టేజ్ లీగ్.. పాకిస్థాన్‌ను ఎగతాళి చేసిన ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు