Share News

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. భూ కబ్జాదారులకు ఎమ్మార్వో వార్నింగ్

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:45 PM

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూ కబ్జాదారులను కదిరి తహశీల్దార్ రెడ్డి శేఖర్ హెచ్చరించారు.

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. భూ కబ్జాదారులకు ఎమ్మార్వో వార్నింగ్

పుట్టపర్తి, మార్చి 23: ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూ కబ్జాదారులను కదిరి తహశీల్దార్ రెడ్డి శేఖర్ హెచ్చరించారు. ప్రభుత్వానికి చెందిన భూమిలో హెచ్చరిక బోర్డులు తప్పకండా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని సర్వే నెంబర్ 83లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై భూ కబ్జా రాయళ్ల కళ్లు పడ్డాయి. ఆ భూమిని ఆక్రమించడమే కాకుండా.. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గుర్తించింది.


ఈ భూ ఆక్రమణలపై వరుసగా కథనాలను ప్రసారం చేసింది. దాంతో కదిరిలోని రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమితోపాటు అందులో నిర్మించిన అక్రమ కట్టడాలను కదిరి తహశీల్దార్ రెడ్డి శేఖర్‌తోపాటు సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా భూ కబ్జాదారులను కదిరి ఎమ్మార్వో రెడ్డి శేఖర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌తో పరిశ్రమల హబ్‌గా విశాఖ ప్రాంతం: మంత్రి అనగాని

మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు

For More AP News And Telugu News

Updated Date - Mar 23 , 2026 | 12:46 PM