Share News

సీఎం చంద్రబాబు విందు.. హాజరు కానున్న మంత్రులు, కార్యదర్శులు

ABN , Publish Date - Apr 29 , 2026 | 08:53 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులు, ప్రభుత్వంలోని పలు శాఖల కార్యదర్శలు, వివిధ విభాగాల అధిపతుల(హెచ్‌ఓడీ)కు ఆయన విందు ఇవ్వనున్నారు.

సీఎం చంద్రబాబు విందు.. హాజరు కానున్న మంత్రులు, కార్యదర్శులు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులు, ప్రభుత్వంలోని పలు శాఖల కార్యదర్శలు, వివిధ విభాగాల అధిపతుల(హెచ్‌ఓడీ)కు సీఎం చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. గురువారం (ఏప్రిల్ 30వ తేదీ) రాత్రి సీఆర్డీఏ కార్యాలయంలో వీరందరికి సీఎం చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. తనకు వచ్చిన ఈ అవార్డు రాష్ట్రానికి, ప్రభుత్వానికి వచ్చిన గుర్తింపు అని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.


టీమ్ ఏపీ స్పిరిట్‌తో పని చేయడం వల్లే.. అందరి సహకారం, భాగస్వామ్యంతో ఈ అవార్డు వచ్చిందని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులను మోటివేట్ చేసేందుకు, వారి సహకారానికి ధన్యవాదాలు తెలిపేందుకు వారిని ఈ డిన్నర్‌కు ఏపీ సీఎం ఆహ్వానించారు. డిన్నర్ విత్ విన్నర్స్ పేరుతో మంత్రులు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు పేరుతో ఆహ్వానాలు వెళ్లాయి.


రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో అధికారం చేపట్టిన ఈ 22 నెలల్లో సాధించిన విజయాలు.. రానున్న 38 నెలల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలపై అధికారులతో చర్చించి ఉత్సాహపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.


తనకు వచ్చిన అవార్డు రాష్ట్రానికి మరిన్నిపెట్టుబడులు తీసుకు రావడానికి, బ్రాండ్ క్రియేట్ చేయడానికి దోహద పడాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలక భాగస్వాములను ఆహ్వానించి కార్యోన్ముఖులను చేసేందుకు ఈ విందు సమావేశాన్ని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గూగుల్ తెచ్చిన ఘనత మాది.. గన్ కల్చర్ మీది: మూర్తి యాదవ్

ఏపీకి కేంద్రం భారీగా నిధులు విడుదల.. స్పందించిన కేంద్ర మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2026 | 08:56 PM