Share News

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..

ABN , Publish Date - May 13 , 2026 | 06:00 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..
AP Cabinet Meet

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు, చర్యలపై సీఎం, మంత్రులు ప్రత్యేకంగా చర్చించనున్నారు. అనంతరం దీనిపై అధికారులు, మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది.


ఏపీలోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంపైనా మంత్రిమండలిలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. 17వ ఎస్‌ఐపీబీ ఆమోదించిన పలు అంశాలపైనా చర్చించి ఆమోదం తెలపనున్నారు. మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,01,023 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్‌కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌కు ఆమోదం ఇవ్వనుంది. కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ గ్రూప్ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయనుంది.


తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్రవాహన తయారీ పరిశ్రమకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పలు కీలక సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ

గన్నవరంలో పుణె ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..

Updated Date - May 13 , 2026 | 06:02 PM