Share News

గన్నవరంలో పుణె ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..

ABN , Publish Date - May 13 , 2026 | 04:32 PM

కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో పుణె ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పుణె నుంచి హైదరాబాద్‌కు 187 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. అయితే, హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు పరిస్థితులు అనుకూలించలేదు.

గన్నవరంలో పుణె ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..
IndiGo Flight Emergency Landing

కృష్ణా జిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో పుణె ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పుణె నుంచి హైదరాబాద్‌కు 187 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. అయితే, హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చాలా సేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది ఇండిగో విమానం.


అయినా, వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో పైలట్ విమానాన్ని గన్నవరం విమానాశ్రయం వైపునకు మళ్లించారు. అక్కడికి చేరుకున్న అనంతరం అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి సురక్షితంగా విమానం కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సుమారు రెండు గంటలుగా గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వేపైనే పుణె ఇండిగో విమానాన్ని అధికారులు నిలిపివేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ

విశాఖలో అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్

Updated Date - May 13 , 2026 | 04:36 PM