ధనేకుల రామారావు పోరాటంతోనే రాజధాని నిలబడింది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 15 , 2026 | 03:28 PM
రాజధాని అమరావతి జేఏసీ సభ్యుడు ధనేకుల రామారావు మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
అమరావతి, సెప్టెంబర్15: రాజధాని అమరావతి జేఏసీ సభ్యుడు ధనేకుల రామారావు మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. రామారావు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. రాజధాని అమరావతి ఉద్యమంలో మొదటి నుంచి ఆయన చురుగ్గా పాల్గొన్నారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ పోరాటంలో భాగంగానే అక్రమ కేసులతో ఆయన జైలుకు వెళ్లారని వివరించారు. రామారావు లాంటి వారి పోరాటంతోనే రాజధాని అమరావతి నిలబడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ధనేకుల రామారావు పోరాటం చిరస్మరణీయం: మంత్రి లోకేశ్
అమరావతి రైతు, రాజధాని JAC సభ్యులు ధనేకుల రామారావు మృతి బాధాకరమని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. వారి సేవలు స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. అమరావతి రాజధాని ఉద్యమంలో ముందు నడిచి ఎన్నో కేసులు ఎదుర్కున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. 40 రోజులు జైలులో నిర్బంధించిన ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అమరావతి అంటూ నినదించిన ధనేకుల రామారావు పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
అమరావతి రైతులకు ఆదర్శంగా నిలబడ్డ ధనేకుల రామారావు: నారాయణ
రాజధాని అమరావతి ఏర్పాటు కోసం ల్యాండ్ పూలింగ్‌కు మొదటిగా భూములిచ్చి.. ఆ ప్రాంత రైతులకు ధనేకుల రామారావు ఆదర్శంగా నిలబడ్డారని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి జేఏసీ సభ్యులు ధనేకుల రామారావు మృతికి ఆయన సంతాపం తెలిపారు. గత ప్రభుత్వంలో రైతుల ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. ధనేకుల రామారావు ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసు.. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
For More AP News And Telugu News