Share News

ఎన్డీయే బలం మన ఐక్యతలోనే ఉంది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 17 , 2026 | 09:43 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వాద్ నగర్‌ సేవా సంకల్ప అభియాన్ యాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఎన్డీయే బలం మన ఐక్యతలోనే ఉంది: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వాద్ నగర్‌ సేవా సంకల్ప అభియాన్ యాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ‘ఈ రోజు పవిత్ర నగరం కాశీలో జరిగిన వారణాసి - వాద్ నగర్ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన 25 ఏళ్ల నిస్వార్థ సేవా ప్రస్థానాన్ని వేడుకగా జరుపుకోవడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’.


‘ఈ కార్యక్రమానికి ముందు భారత పౌరులందరి శ్రేయస్సు, శాంతిని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో కలిసి శ్రీకాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాను. ఎన్‌డీఏ ఐక్యత, దేశ ప్రగతి పట్ల ఆంధ్రప్రదేశ్ పూర్తి నిబద్ధతతో ఉంది. మన ఐక్యతే ఎన్డీయే బలం. వికసిత్ భారత్ సాధించడమే మనందరి ఉమ్మడి లక్ష్యం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డ్రోన్‌ సాయంతో కుక్కకు స్నానం.. వీడియో చూస్తే అవాక్కవుతారు..

పర్యాటకులపై పడిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

Updated Date - Sep 17 , 2026 | 10:09 PM