Share News

రాజధానిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టండి.. పార్టీ శ్రేణులకు సీఎం పిలుపు

ABN , Publish Date - Mar 31 , 2026 | 08:10 PM

అమరావతిని రాజధానిగా చేస్తూ కేంద్రం చట్టం చేస్తోందని.. దీనిని ప్రజల్లోకి సగర్వంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం అమరావతిలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాజధానిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టండి.. పార్టీ శ్రేణులకు సీఎం పిలుపు

అమరావతి, మార్చి 31: అమరావతిని రాజధానిగా చేస్తూ కేంద్రం చట్టం చేస్తోందని.. దీనిని ప్రజల్లోకి సగర్వంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం అమరావతిలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత పాలకులు మూడు రాజధానుల పేరుతో.. మూడు ముక్కలాటలు ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. దాంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా వెనుకంజ వేశారన్నారు. 2019లో మనం మళ్లీ గెలిచి ఉంటే.. ఆదర్శ నగరంగా అమరావతి నిర్మాణం అయ్యేదని పేర్కొన్నారు. రాజధానిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలంటూ టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని స్పష్టం చేశారు. నేరచరిత్ర ఉన్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. పార్టీలోని కార్యకర్తల పట్ల సత్ప్రవర్తనతో మెలగాలంటూ ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యకర్తలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని తెలిపారు.


విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల నుంచి గట్టెక్కిస్తున్నామని వివరించారు. ఈ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,400 కోట్ల నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు సైతం శంకుస్థాపన చేశామని చెప్పారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. నాడు పట్టిసీమను వ్యతిరేకించారు.. నేడు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించిందని చెప్పారు. మిగులు నీళ్లను రాయలసీమకు అందిస్తున్నామని పేర్కొన్నారు.


తుంగభద్ర డ్యామ్ గేట్లకు సైతం మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. శ్రీశైలం డ్యామ్ ఫ్లంజ్ పూల్ పూడ్చే పనులు కూడా చేపట్టామని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చేందుకు అనేక ప్రాజెక్టులు తెచ్చామన్నారు. జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు పదవులు కేటాయించి నాయకత్వాన్ని పెంచుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మగ్గాలు ఉన్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్న చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: మంత్రి లోకేశ్

బెంగళూరులో సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య

For More AP News And Telugu News

Updated Date - Mar 31 , 2026 | 09:49 PM