Share News

బీసీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

ABN , Publish Date - Feb 04 , 2026 | 07:06 PM

బీసీ సంక్షేమంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం పలు అంశాలపై వారికి ఆయన దిశానిర్దేశం చేశారు.

బీసీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
AP CM Chandrababu

అమరావతి, ఫిబ్రవరి 04: రూ.60 కోట్ల సాస్కి నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం నాడు రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణంతోపాటు సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్ధాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెల్త్, ఎడ్యుకేషన్ సహా అన్ని రంగాల్లోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలని వారికి చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్థుల విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి లింక్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా, 814 హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు వివరించారు. ఈ సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా?: సీఎం రేవంత్‌

13 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 07:45 PM