Share News

ఏపీఎస్ఆర్టీసీకి 'పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్' అవార్డ్

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:33 PM

ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి జాతీయ గుర్తింపు లభించింది. సాంకేతికత వినియోగంలో విశిష్టతకు గానూ ప్రతిష్ఠాత్మక పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్ దక్కింది.

ఏపీఎస్ఆర్టీసీకి 'పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్' అవార్డ్
APSRTC Wins PSE Technology and Innovation Award 2026

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC)కు మరో జాతీయ అవార్డ్ లభించింది. సాంకేతిక వినియోగంలో విశిష్ట ప్రతిభకు గుర్తింపుగా పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్-2026 పురస్కారం దక్కింది. మెరుగైన ప్రజా రవాణా సహా డిజిటల్ సేవల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నందుకు గానూ ఈ అరుదైన గౌరవం పొందింది ఏపీఎస్ఆర్టీసీ. హైదరాబాద్‌లో జరిగిన ఇండియా పీఎస్ఈ సమ్మిట్‌లో ఈ అవార్డును సొంతం చేసుకుంది.


రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా సాంకేతికతను వినియోగిస్తూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సహా ఇతర అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే డిజిటల్ టికెటింగ్, కార్గో సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఇది ఆర్టీసీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కాగా.. ఈ ఏడాది జనవరి 16న గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్ అండ్ అవార్డ్స్‌ ప్రదానోత్సవంలోనూ జాతీయ పురస్కారం పొందింది ఏపీఎస్ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లలో ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్(AAS) ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రయాణికులకు డిజిటల్ సేవలను అందించినందుకు గానూ అవార్డ్ దక్కింది. ఢిల్లీలో నాడు జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చీఫ్ ఇంజినీర్(ఐటీ) వై.శ్రీనివాసరావు పురస్కారాన్ని అందుకున్నారు.


ఇవీ చదవండి:

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్'.. అవార్డు

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం.. 11 మందికి లీగల్ నోటీసులు

Updated Date - Apr 25 , 2026 | 06:53 PM