Share News

న్యూఢిల్లీకి ఏపీ మహిళా ప్రజాప్రతినిధులు

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:04 PM

పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు కూటమిలోని పార్టీలు మద్దతు ప్రకటించనున్నాయి. దాంతో ఆయా పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వేదికగా మద్దతు తెలపనున్నారు.

న్యూఢిల్లీకి ఏపీ మహిళా ప్రజాప్రతినిధులు

అమరావతి, ఏప్రిల్14: పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు కూటమిలోని పార్టీలు మద్దతు ప్రకటించనున్నాయి. దాంతో ఆయా పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వేదికగా మద్దతు తెలపనున్నారు. అందుకోసం వారంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏప్రిల్16వ తేదీన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో కూటమి మహిళ ప్రజాప్రతినిధులంతా లోక్‌సభ గ్యాలరీలో కూర్చొనున్నారు.


అలాగే ఏప్రిల్ 17వ తేదీన ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా రాజ్యసభలోని గ్యాలరీలో వారంతా కూర్చొననున్నారు. దీంతో ఏప్రిల్ 16,17 తేదీల్లో ఏపీలోని కూటమికి చెందిన మహిళా ప్రతినిధులంతా దేశ రాజధాని న్యూఢిల్లీలోనే ఉండనున్నారు. అందుకోసం బుధవారం సాయంత్రం లోపు అంతా ఢిల్లీ చేరుకోవాలని వారికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే ఆదేశించారు. దీంతో ఏపీలో కూటమిలోని పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 16, 17,18 తేదీల్లో ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ బిల్లు ఆమోదానికి ఇప్పటికే కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఈ బిల్లుకు మద్దతుగా ఏపీలోని ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తలుపులు తెరిచి ఉన్నాయి.. వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు: కార్మికులకు మంత్రి సూచన

26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

For More AP News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 12:22 PM