ఏపీలో నేటి నుంచి ప్రత్యేక ఓటర్ డ్రైవ్.. ఇంటింటికి తనిఖీలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:34 AM
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఆంధ్రప్రదేశ్‌లో నేటి (గురువారం) నుంచి ప్రత్యేక ఓటర్ డ్రైవ్ ప్రారంభం కానుంది. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన వారు.. అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని వారిని గుర్తించి వివరాలను చేర్చడంపై ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
అమరావతి, అక్టోబర్ 08: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఆంధ్రప్రదేశ్‌లో నేటి (గురువారం) నుంచి ప్రత్యేక ఓటర్ డ్రైవ్ ప్రారంభం కానుంది. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన వారు.. అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని వారిని గుర్తించి వివరాలను చేర్చడంపై ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44.89 లక్షల మంది ఓటర్లు.. తాము నమోదు చేసుకున్న చిరునామాలలో లేరని ఈసీ ఇప్పటికే గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వారి వివరాలను బీఎల్‌వోలు పరిశీలిస్తారు. పొరపాటుగా ఓటరు పేరు తొలగించినట్లు గుర్తిస్తే.. వారికి ఫామ్-6 అందించి తిరిగి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు, అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాని వారిని గుర్తించి వారికి దరఖాస్తులు అందించనున్నారు.
ఇక ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా తమ వివరాలను పరిశీలించుకోవాలని అర్హులైనవారికి ఈసీ అధికారులు సూచిస్తున్నారు. పేరు, చిరునామాలలో తప్పులు ఉన్నా.. జాబితాలో పేరు లేకపోయినా సంబంధిత అధికారులను సంప్రదించి.. వాటిని సరిచేసుకోవాలని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ప్రక్రియ అనంతరం అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెలాఖరులో జీఎస్‌ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10.30 నుంచి కరెంట్ కట్