Share News

ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం..

ABN , Publish Date - May 22 , 2026 | 08:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎండలో విధులు నిర్వర్తించడం ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. దీంతో వారి సంక్షేమంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం..
AP DGP Harish Kumar Gupta

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎండలో విధులు నిర్వర్తించడం ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. దీంతో వారి సంక్షేమంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మండుటెండల్లో గంటల తరబడి రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి రక్షణ కల్పించేందుకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం రూ.48 లక్షల ప్రత్యేక నిధులను కేటాయించారు.


ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 3,192 మంది ట్రాఫిక్ పోలీసులకు యూవీ ప్రొటెక్షన్ గాగుల్స్, వైట్ క్యాప్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ఫేస్ మాస్కులు అందించనున్నారు. ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసు శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఏపీలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలకు నిధులను తక్షణమే విడుదల చేయాలని డీజీపీ ఆదేశించారు. అవసరమైన సామగ్రి కొనుగోలు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రతి యూనిట్‌ను పంపిణీ చేయాలని ఆజ్ఞాపించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణ కోసం పోలీసు శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్ శాంతి దూతలా ప్రవచనాలు చేస్తున్నారు: ఎంపీ కేశినేని చిన్ని

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

Updated Date - May 22 , 2026 | 08:30 PM