Share News

ప్రయాణికులకు స్కూట్ ఎయిర్‌లైన్స్‌ సర్క్యులర్.. భోగాపురం నుంచే అన్ని సర్వీసులు..

ABN , Publish Date - May 22 , 2026 | 06:58 PM

జులై 8వ తేదీ నుంచి తమ విమానాలన్నీ భోగాపురం నుంచే నడుస్తాయని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. జులై 8వ తేదీ నుంచి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి రావాలని ఇప్పటికే తమ ప్రయాణికులకు సర్క్యులర్లు జారీ చేశాయి.

ప్రయాణికులకు స్కూట్ ఎయిర్‌లైన్స్‌ సర్క్యులర్.. భోగాపురం నుంచే అన్ని సర్వీసులు..
Bhogapuram Airport

అమరావతి, మే 22: జులై 8వ తేదీ నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. జులై 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. జులై 8వ తేదీ నుంచి తమ విమానాలన్నీ భోగాపురం నుంచే నడుస్తాయని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. జులై 8వ తేదీ నుంచి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి రావాలని ఇప్పటికే తమ ప్రయాణికులకు సర్క్యులర్లు జారీ చేశాయి.


2026 జూలై 8వ తేదీ నుంచి స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన అన్ని విమానాలు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కాకుండా.. కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడుస్తాయని స్కూట్ ఎయిర్‌లైన్స్‌ సర్క్యులర్ జారీ చేసింది. విమానాశ్రయం మారినప్పటికీ, ఎయిర్‌పోర్ట్ కోడ్ 'VTZ' గానే కొనసాగుతుందని తెలిపింది. చెక్-ఇన్ కౌంటర్లు, స్కూట్ ఎయిర్‌లైన్స్ కౌంటర్లు కొత్త విమానాశ్రయంలోని టెర్మినల్ 1 లోపల ఉంటాయని విమానయాన సంస్థ వెల్లడించింది.


విమానం బయలుదేరే సమయానికి 2.5 గంటల (150 నిమిషాలు) ముందే చెక్-ఇన్ కౌంటర్లు తెరవబడతాయని తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) విశాఖపట్నం సిటీ సెంటర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికులు ఎలాంటి ఆలస్యం లేకుండా చెక్-ఇన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవడానికి.. విమానం టైం కంటే కనీసం 120 నిమిషాల (2 గంటల) ముందే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని స్కూట్ ఎయిర్ లైన్స్ సంస్థ సూచించింది.


ఇవి కూడా చదవండి

బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్

ఎవరెస్ట్‌పై విషాదం.. కిందకు వస్తుండగా ఇద్దరు భారతీయుల మృతి

Updated Date - May 22 , 2026 | 07:02 PM