ఎవరెస్ట్‌పై విషాదం.. కిందకు వస్తుండగా ఇద్దరు భారతీయుల మృతి
ABN , Publish Date - May 22 , 2026 | 06:18 PM
ఎవరెస్ట్ పర్వత శిఖరంపై విషాదం చోటుసేసుకుంది. పర్వతారోహణ ముగించుకుని కిందకు దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు నేపాల్ అధికారులు ప్రకటించారు. మృతులను అరుణ్‌కుమార్ తివారీ, సందీప్ అరేగా గుర్తించారు.
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ పర్వత శిఖరంపై విషాదం చోటుసేసుకుంది. పర్వతారోహణ ముగించుకుని కిందకు దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు నేపాల్ అధికారులు ప్రకటించారు. మృతులను అరుణ్‌కుమార్ తివారీ, సందీప్ అరేగా గుర్తించారు.
ఎవరెస్ట్ శిఖరం దిగుతుండగా సందీప్ అరే తీవ్రంగా అలసిపోయారని, ఆయనను కాపాడేందుకు గైడ్స్ ప్రయత్నించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారని ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ సెక్రటరీ జనరల్ రిషి భండారి తెలిపారు. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలోనే మరో పర్యతారోకుడు అరుణ్ తివారీ కూడా ఎవరెస్ట్ నుంచి కిందకు దిగుతూ హిల్లరీ స్టెప్ వద్ద తీవ్రంగా అలసిపోవడంతో నలుగురు గైడ్స్ ఆయనకు సాయం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు. క్యాంప్-2 వద్ద ఆయన కన్నుమూసినట్టు వివరించారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని గత బుధవారంనాడు విజయవంతంగా 274 మంది అధిరోహించారు. ఒకోరోజు అత్యధిక సంఖ్యలో ఎవరెస్ట్ అధిరోహించిన బృందంగా కూడా వీరు రికార్డు నెలకొల్పారు. ఇందులో సందీప్ అరే కూడా అన్నారు. అయితే పర్వతం నుంచి కిందకు దిగుతుండగా సందీప్ అరే మృతిచెందగా, గురవారంనాడు మరో బృందం ఎవరెస్ట్ శిఖరం చేరుకుంది. అందులో అరుణ్ తివారీ ఉన్నారు. పర్వతం దిగివస్తుండగా ఆయన మృతి చెందారు.
దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలు.. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
విజయ్ క్యాబినెట్ విస్తరణ.. ప్రభుత్వంలో కొత్తగా మరో ఇద్దరి చేరిక