Share News

దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలు.. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - May 22 , 2026 | 05:22 PM

దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు తమ అధీనంలో ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కీలక పిటిషన్ల విచారణకు అత్యన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అంగీకరించింది.

దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలు.. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
Supreme Court

న్యూఢిల్లీ: తమిళనాడు, ఆంధప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలో హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించాలంటూ ఏప్రిల్ 2025న ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది.


దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు తమ అధీనంలో ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కీలక పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు అంగీకరించింది. కేసును హైకోర్టులకు బదిలీ చేస్తూ గతంలో ఇచ్చిన పాత ఆదేశాలను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీశ్ శర్మతో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. చట్టాల చెల్లుబాటుపై జూలై 24 నుంచి మెరిట్స్ ఆధారంగా తామే తుది విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టంచేసిం


ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో హిందూ ధార్మక సంస్థల నియంత్రణ చట్టాలను పిటిషన్లరు సవాలు చేశారు. కేవలం హిందూ ఆలయాలనే నియంత్రించడం రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛ, సమానత్వ హక్కులకు విరుద్ధమని తమ పిటిషన్‌లో స్వామి దయానంద సరస్వతి ట్రస్ట్ పేర్కొంది. ఆలయాల హుండీ ఆదాయం, మిగులు నిధులను ప్రభుత్వాలు ఇతర కార్యకలాపాలకు మళ్లించడంపై పలువురు పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక సమానత్వం, నిధుల అవినీతిని అరికట్టేందుకే ఆలయాల నిర్వహణలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట్రాలు వాదన వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ అశంపై హైకోర్టును ఆశ్రయించాలంటూ గతంలో ఆదేశించిన సుప్రీంకోర్టు తాజాగా తామే స్వయంగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కాగా, సుప్రీంకోర్టు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. వేర్వేరు హైకోర్టుల కంటే సుప్రీంకోర్టు తేల్చడమే సముచితమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

విజయ్ క్యాబినెట్‌ విస్తరణ.. ప్రభుత్వంలో కొత్తగా మరో ఇద్దరి చేరిక

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

Updated Date - May 22 , 2026 | 05:28 PM