Share News

పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Sep 24 , 2026 | 08:06 PM

సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు వరుస సెలవుల ఉన్నా పింఛనుదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ

అమరావతి, సెప్టెంబర్ 24: సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు వరుస సెలవుల ఉన్నా పింఛనుదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్1వ తేదీ మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేపడతామని తెలిపారు. అక్టోబర్ 1 ఉదయం నగదు విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులకు ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.


ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసుకుని మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ పంపిణీ విధానంలో మార్పును గమనించి సహకరించాలని ఈ సందర్భంగా పింఛనుదారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 61.80 లక్షల మంది పింఛనుదారుల కోసం రూ.2,692.34 కోట్లు విడుదల చేస్తున్నట్లు వివరించారు.


రూ.2,675.63 కోట్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పింఛను ఖాతాలకు జమ చేస్తామని వివరించారు. రూ.16.65 కోట్లు పింఛనుదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తామన్నారు. గజపతినగరం మండలంలో ఎస్‌ఎన్‌ఏ స్పర్శ్ విధానంలో డీబీటీ పైలట్ అమలు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో యూనిట్లు, జీసీసీలు ఏర్పాటు చేయండి.. వివో, సిస్కో, అబాట్, మాస్టర్‌కార్డ్, శాప్‌కు లోకేశ్ ఆహ్వానం

క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 08:10 PM