Share News

ఏపీలో ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:44 PM

రాష్ట్రంలో స్థానిక సంస్థలు.. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది.

ఏపీలో ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ

అమరావతి, అక్టోబర్18: రాష్ట్రంలో స్థానిక సంస్థలు.. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు. ఈ రోజు చివరి రోజు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.


వీటిని సోమవారం అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 21వ తేదీ. అక్టోబర్ 28వ తేదీన ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన కౌంటింగ్ చేపడతారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం (అక్టోబర్ 14)న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. మరో వైపు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అక్టోబర్19వ తేదీ (సోమవారం) నోటిఫికేషన్ విడుదల కానుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 04:13 PM