ఇమామ్లు, మౌజన్లకు రూ.22.45 కోట్ల గౌరవ వేతనం విడుదల
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:39 PM
రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్లు, మౌజన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. మొత్తం 9,982 మందికి మూడు నెలల గౌరవ వేతనం కింద రూ.22.45 కోట్లను విడుదల చేసింది.
అమరావతి, అక్టోబర్ 14: రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్లు, మౌజన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. మొత్తం 9,982 మందికి మూడు నెలల గౌరవ వేతనం కింద రూ.22.45 కోట్లను విడుదల చేసింది. అందులో 4,991 మంది ఇమామ్లు, 4,991 మంది మౌజన్లు ఉన్నారు.
మసీదుల్లో రోజువారీ ప్రార్థనా కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు ఇమామ్లు, మౌజన్లు కీలక పాత్ర పోషిస్తారు. వారి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నెలలవారీ గౌరవ వేతనాన్ని అందిస్తోంది. ఇమామ్లకు నెలకు రూ.10,000, మౌజన్లకు నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తున్నారు. గత 27 నెలలకు కలిపి ఇప్పటివరకు ఇమామ్లు, మౌజన్లకు మొత్తం రూ.202 కోట్ల గౌరవ వేతనాన్ని అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సర్కు వ్యతిరేకంగా 2 లక్షల మందితో మార్చ్: టీపీసీసీ చీఫ్
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Read Latest AP News And Telugu News