రైతన్నలకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 12 , 2026 | 09:16 PM
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి ముందే రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో శుక్రవారం నాడు నగదు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అమరావతి, మార్చి 12: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి ముందే రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో శుక్రవారం(13-03-2026) నాడు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. గురువారం రోజు అమరావతిలో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం ఈ ప్రకటన చేశారు. దీని వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నగదును రైతుల ఖాతాల్లో వేస్తారు. రూ.6వేల చొప్పున దాదాపు 46.85లక్షల మంది ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ కానున్నాయి.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.4వేలు వేయనుంది. ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మరో రూ.2వేలు విడుదల చేయనుంది. దీంతో శుక్రవారం ఏపీ రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ కానుంది. అస్సాం రాష్ట్రం గౌహతిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఏపీకి మరో పరిశ్రమ.. శంకుస్థాపన చేసిన లోకేశ్
గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
For More AP News And Telugu News