Share News

రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటీకరణ అంటూ వైసీపీ ప్రచారం.. స్పందించిన ప్రభుత్వం

ABN , Publish Date - Jul 19 , 2026 | 09:39 PM

రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటీకరణ అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దుష్ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది.

రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటీకరణ అంటూ వైసీపీ ప్రచారం.. స్పందించిన ప్రభుత్వం

అమరావతి, జులై 19: రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటీకరణ అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దుష్ప్రచారాన్ని ప్రభుత్వం ఆదివారం ఖండించింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ద్వారా సేవలు మరింత సులభతరం చేస్తున్నట్లు వివరించింది. సబ్ - రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరగడం లేదంటూ ప్రభుత్వం వివరించింది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చట్టబద్ధ అధికారాలన్నీ ప్రభుత్వ శాఖ వద్దే ఉంటాయని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే పనిచేస్తాయని వెల్లడించింది.


డాక్యుమెంట్ పరిశీలన, ఆమోదం, డిజిటల్ సంతకం, రిజిస్ట్రేషన్‌ను సబ్-రిజిస్ట్రార్లే నిర్వహిస్తారని పేర్కొంది. డేటా, రికార్డులు పూర్తిగా రిజిస్ట్రేషన్ శాఖ ఆధీనంలోనే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో ఫెసిలిటేషన్ ఛార్జీ గరిష్ఠంగా రూ.2 వేలు మాత్రమేనని వివరించింది. మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితి తగ్గి పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్, అడ్వాన్స్ స్లాట్ బుకింగ్, ఇంటిగ్రేటెడ్ పేమెంట్ వంటి సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సోనియా, రాహుల్‌ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కి ఉందా?: జగ్గారెడ్డి

ఎల్‌నినో ఎఫెక్ట్.. 10 జిల్లాలకు స్పెషల్ ఐఏఎస్‌లు

For More AP News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 09:55 PM