APSRTC Special Buses: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:29 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పర్వదినానికి 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది.
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పర్వదినానికి 8,432 ప్రత్యేక బస్సుల(Sankranti Special Buses)ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారి కోసం ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి 2,432 బస్సులను ఏర్పాటు చేయగా.. మిగిలిన బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు వెల్లడించింది. అలాగే మరో తీపి కబురు సైతం ఏపీఎస్ ఆర్టీసీ చెప్పింది. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు తెలిపింది.
సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పండుగకు గ్రామాలు, పట్టణాలు, నగరాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతాయి. స్థానికులే కాకుండా బతుకుదెరువుకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారూ తప్పకుండా స్వగ్రామాలకు వస్తుంటారు. బంధు, మిత్రులతో కలిసి ఘనంగా పండుగను చేసుకుంటారు. పిండి వంటలు, కోడి, ఎడ్ల పందేలతో బోగి, సంక్రాంతి, కనుమ మూడ్రోజులపాటు సందడి చేస్తారు. వీరి కోసమే ప్రతి ఏడాది లాగానే ఈసారీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదే: బీజేపీ చీఫ్
కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News