ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 3,240 గ్రామాల్లో రేపే పోలింగ్
ABN , Publish Date - Nov 25 , 2026 | 08:52 PM
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం 26 జిల్లాల్లోని 3,240 పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.
అమరావతి, నవంబర్ 25: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం 26 జిల్లాల్లోని 3,240 పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి.. ఫలితాలను ప్రకటించనున్నారు. ఏకగ్రీవాలు మినహా 3,240 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలివిడతలో 709 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 31,614 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ దశ ఎన్నికల్లో 74.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,167 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో.. 26 నవంబర్, 29 నవంబర్, 02 డిసెంబర్ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికలతోపాటే తుది దశ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీ/ నగర పంచాయతీలకు కూడా గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలు నవంబర్ 30న వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. తొలి దశలో 100 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్ల కూటమిలోని పార్టీలు తమ సత్తా చాటాయి. తుది దశలో రేపు (గురువారం) 23 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ షాపుల్లో వైద్య పరీక్షలు.. హడలిపోతున్న మందుబాబులు.. వీడియో వైరల్
ఎన్నికల వేళ.. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఐజీ రాజకుమారి